Advertisement

కోతి పిల్ల సందేహం నీతి కథ || The doubtful monkey Telugu moral stories || 3D animated fairy tales

కోతి పిల్ల సందేహం నీతి కథ || The doubtful monkey Telugu moral stories || 3D animated fairy tales కోతి పిల్ల సందేహం నీతి కథ || The doubtful monkey Telugu moral stories || 3D animated fairy tales
#కోతిపిల్లసందేహంనీతికథ #Telugumoralstories #bedtimestories

*************** కోతిపిల్ల సందేహం *********************

ఓ అడవిలో ఒక కోతిపిల్ల వుండేది. అది ఎప్పుడూ అడవిలో తిరుగుతూ అన్ని ప్రాణులను గమనిస్తూ వుండేది.
రకరకాల పక్షులు, జంతువులను చూసినప్పుడల్లా " ఇవి ఒక్కోటి ఒక్కో రకంగా ఎందుకు వున్నాయి..?" లాంటి ప్రశ్నలు తనకి ఎప్పుడూ కలుగుతుండేవి. " ఏంటో..! ఈ అడవిలో వున్న జంతువులు, పక్షులన్నీ ఒకేలా లేవు. ఒక దానికి తోక వుంటే, మరొక దానికి పెద్దరెక్క వుంది.. ఒకటి నేల మీద పరుగెడుతుంటే, ఇంకొకటి నీటిలో ఈదుతూ వుంది, మరొకటి గాలిలో ఎగురుతూ వుంది.. ఎందుకిలా..? ఏం అర్ధం కావడంలేదు. ఎవరికైనా అమ్మే మొదటి గురువు అంటారు. నా సందేహాలను అమ్మని అడిగి తీర్చుకుంటాను" అని తల్లి దగ్గరకు వెళ్ళింది.

" అమ్మా.. అమ్మా .. ! నాకు కొన్ని సందేహాలు వున్నాయి.. వాటిని నువ్వు తీర్చుతావా..?" అని అడిగింది.
" తప్పకుండా తీరుస్తాను .. అడుగు చిన్నా.." అంది తల్లి కోతి. " ఈ అడవిలో ఒక్కొక్కరూ ఒక్కోలా వున్నారు. అసలు మనకు ఇంత పొడుగు తోకలు ఎందుకు వున్నాయి?" "ఒహో .. అదా నీ సందేహం.. మనం కోతులం .. ఎప్పుడూ ఒకే చోటవుండం. ఒక చెట్టు మీంచి వేరొక చెట్టు మీదకి దూకుతానేవుంటాం.. మన ఈ తోకతో చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని పెద్దపెద్ద చెట్లను దాటుతాం. అంతేకాదు మన ఈ తోకతో మన ఒంటిమీద వాలిన కీటకాలను కూడా తరిమికొడతాం." "అలాగా..! అమ్మా, తోక మనకేనా .. వేరే ఎవరికీ వుండదా..?" "ఉండకే.. చాలా వాటికి వుంటుంది.. చేప చెల్లాయిలు తోక సహాయంతోనే ఈద గలుగుతాయి. కంగారు బాబాయిలు పరుగు పెట్టేటప్పుడు తోకను పడిపోకుండా సహాయం కోసం ఉపయోగిస్తారు. ఆత్మరక్షణ కోసం తేలు మామ తోకలో విషాన్ని దాచుకుంటుంది. నెమలి పిన్నిలు రంగు రంగుల తోకలను చూపించి నాట్యం చేస్తాయి." "అలాగా .. అమ్మా , ఏనుగులకు ముక్కు ఎందుకు అలా వుంటుంది?." " నీ ఏనుగు మిత్రుడి దగ్గరకు వెళ్ళి నీవే అడుగు." అంది తల్లి కోతి.

పిల్లకోతి తన మిత్రుడైన ఏనుగు దగ్గరకు వెళ్ళింది. " మిత్రమా .. నీ ముక్కు ఎందుకు అంత పొడవుగా వుంది." అని అడిగింది. " అయ్యో! దీనిని ముక్కు అనకూడదు .. తొండం అనాలి.." అంది ఏనుగు.. " అలాగా.."
"ఈ తొండంతో బోలెడు నీళ్ళు ఒకేసారి తాగేయొచ్చు.. అలాగే చెట్టుపైనున్న పండు సులభంగా అందుకోవచ్చు. పెద్ద పెద్ద బరువులు మోయొచ్చు.. అంతేకాకుండా ఈ తొండం నాకు ఎంత అందంగా వుందో చూసావా.." "అవునవును.. నిజమే కదా.."

అలా ఏనుగు, కోతి నది పక్కనే వెళుతుంటే ఒక చేప నీటిలో ఎగురుతూ కనబడుతుంది. " చేప మిత్రమా నీవెందుకు ఎప్పుడూ నీటిలోనే వుంటావు.? చలి వేయదా..!" అంది పిల్ల కోతి. "లేదు మిత్రమా .. మాకు నీటిలోనే హాయిగా వుంటుంది. మాకు కావలసిన ఆహార పదార్దాలను నీటిలోనే వెతుక్కుని తింటాం ..పైగా మీకు దాహం వేస్తే నీరుకోసం పరుగు పెట్టాలి.. కానీ, మేము ఎప్పుడూ నీటిలోనే వుండటం వలన దాహం అనేదే వేయదు. "
" అవునవును.. నీవు చెపినట్టు నాకు ఇప్పుడు దాహం వేస్తోంది.." అని కోతి, ఏనుగు నదిలో నీరు తాగాయి.
"వస్తాను మిత్రులారా.." అని పిల్ల కోతి- ఏనుగు, చేపలకు చెప్పి అలా చెట్టు మీదకి గెంతింది.

చెట్టు కొమ్మమీద ఒక కాకి కూర్చుని ఏదో తింటూ పిల్ల కోతికి కనిపించింది. " కాకి మిత్రమా.. నీకేంటి కాళ్ళు మాత్రమే వున్నాయి.. చేతులు లేవేంటీ..?" అని అడిగింది. " మాకు చేతులు వుండవు.. వాటి స్దానంలో రెక్కలు వుంటాయి. రెక్కల సహాయంతోనే మేము ఎంత దూరమైనా ఎగరగలుగుతాము. అలా ఎగురుతూ ఎగురుతూ మాకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాము. పైగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు మాకు ముందుగానే తెలిసిపోతుంది. అప్పుడు వేగంగా ఈ రెక్కల సాయంతోనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోతాం." "ఓ అలాగా..! " అని అక్కడినుండి వెళ్ళిపోయిన పిల్ల కోతి తల్లి దగ్గరకు చేరుకుంటుంది.

" అమ్మా ..ఇవాళ నా మిత్రులు కొందరిని కలిశాను. వాళకున్న ప్రత్యేకతలతో వాళ్ళు ఎంత సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారో నా కళ్ళారా చూసాను. ఆ దేవుడు సృష్టించిన మన జంతుప్రపంచం ఎంత అద్బుతమైందో ఇప్పుడు తెలిసిందమ్మా.." అని ఆనందంగా చెప్పింది. పిల్ల కోతి అలా చెప్పడంతో తల్లికి చాలా ముచ్చటేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే..... " లోపం లేనివారు వుండరు.. కానీ, దాన్నే ఓ ప్రత్యేకతగా భావిస్తే, అంతకు మించిన ఆనందం వుండదు."

RSK Telugu stories,Telugu Stories,కోతి పిల్ల సందేహం నీతి కథ,కోతి పిల్ల సందేహం,కోతి పిల్ల,The doubtful monkey Telugu moral stories,The doubtful monkey,moneky story,telugu moral stories,fairy tales stories,telugu stories,neethi kathalu,story in telugu,short stories,new stories,తెలుగు కథలు,నీతి కధ,3d animation,Elephant,deer,rabbit,crow,fish,forest animals,

Post a Comment

0 Comments