వాతావరణంలో మార్పులతో.. వర్షాలు తగ్గుతున్నాయి. వాన నీటినే నమ్ముకుని సాగులో ముందుకు సాగే రైతన్న పరిస్థితి.. అగమ్యగోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. నేలపై రాలిని ప్రతీ వాన చినుకుని ఒడిసి పడితేనే వ్యవసాయానికి ఢోకా ఉండదు. ఇందుకు నీటి కుంటల నిర్మాణమే ఉత్తమ విధానం అంటున్నారు... వరంగల్ జిల్లా వేదికగా పనిచేస్తోన్న బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి. సేంద్రియ విధానంలో 100 రకాల పండ్ల చెట్లను పెంచడమే కాకుండా... నీటి కుంటల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించి.. రైతుల భూమిలో వాటిని ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందిస్తోందీ ఈ సంస్థ.
0 Comments